శ్రీనగర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత నాది
కాలనీ సమస్యలను గెలిచిన ఆరు నెలల్లో పరిష్కరిస్తా
…. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని*
తిరుపతి
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికి అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం, గాంధీపురం, శ్రీనగర్ కాలనీ ఓం శక్తి గుడి నుండి మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పులివర్తి నాని కి బ్రహ్మరథం పట్టారు. ఫించన్లు, రేషన్ కార్డు, ఇళ్లు పట్టాల బాధితులు తమ సమస్యలు పులివర్తి నాని దృష్టికి తీసుకొచ్చారు. చిన్న చిన్న కారణాలతో వైసీపీ నాయకులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫించన్లు రెట్టింపు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పులివర్తి నాని గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేందుకు తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. చంద్రగిరి నియోజకవర్గ సమస్యలపై తనకు సమగ్రమైన అవగాహన ఉందని, తాను గెలిస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నీతి, నిజాయితీలకు కట్టుబడి, ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రజలకు అండగా నిలవడం నా ముందున్న కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.