గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని అత్త్వెల్లి గ్రామంలో 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.
◆ గ్రామంలో 8 మరియు 10వ వార్డులలో మిగిలిపోయిన ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంక్ ను కచ్చితంగా శుభ్రం చేయాలని, ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటినే త్రాగాలన్నారు, అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు, ప్రత్యామ్నాయంగా గ్రామంలో చేతి పంపులు ఏర్పాటు చేయాలన్నారు.
◆ గ్రామంలో పనిచేస్తున్న విద్యుత్ లైన్ మేన్ వీరేశం ప్రజలకు అందుబాటులో ఉండడని ప్రజలు తెలుపగా… ఎమ్మెల్యే లైన్ మేన్ కచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ అందించాలని ప్రజలకు అందుబాటులో లేడు అనే సమస్య మళ్ళీ పునరావృతం కారదన్నారు. పంటపొలాల్లో మరియు గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, రోడ్డుకు మధ్యలో ఉన్న స్థంబాలను తొలగించాలని, పంటపొలాలకు నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.
◆ అంగన్వాడీ మరియు ANM ఆశా వర్కర్లు ప్రజలకు సరైన పద్దతిలో సేవలు అందించాలని వారికి సూచించారు. ANM మాణిక్యమ్మ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలను అందిస్తోందని ప్రజలు తెలుపగా… ఎమ్మెల్యే ఆమెను అభినందించారు.
◆ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాద్యాయుడు లేడని ప్రజలు తెలుపగా… ఎమ్మెల్యే DEO తో మాట్లాడి బోధన విధానంలో కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
◆ వారంలో ప్రతి శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో రైతులకు పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
◆ వ్యవసాయ శాఖ అధికారి AEO ప్రతిభ రైతులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తుందని ప్రజలు తెలుపగా… ఎమ్మెల్యే AEO ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.