Mahiko Company Field Demonstration of their Hybrid Chili Yashaswini
మహికో కంపెనీ వారి హైబ్రిడ్ మిరప యశస్విని క్షేత్ర ప్రదర్శన
మంచి రకపు విత్తనాల వలన అధిక దిగుబడి సాధించవచ్చు
డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామ నికి చెందిన రైతు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మహికో కంపెనీ వారి యశస్విని హైబ్రిడ్ రకం ను
రెండు ఎకరాలలో సాగుచేశారు.
మైకో కంపెనీ వారు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మంచి రకపు విత్తనాలను ఎంచుకొని రైతులు సాగు చేసినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చునని, ఇట్టి యశస్విని రకం ప్రతికూల వాతావరణం ను మరియు చీడ పీడలను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే విధంగా ఉందని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు
ఈ ప్రదర్శన కి చుట్టుపక్కల గ్రామాల రైతు సోదరులు సందర్శించారు అలాగే ఈ ప్రదర్శన మహికో కంపెనీ ఖమ్మం జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు మేలైన విత్తనాలు వెంచుకోవడం వలన అధిక దిగుబడులు పొందగలుగుతారని, అలాగే పంటలో వచ్చే వివిధ చీడ పీడల నివారణ గురించి సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శన లో రైతుల తో పాటు కంపనీ ఫీల్డ్ ఆఫీసర్స్ జనార్దన్ మరియు పవన్ నాయక్ పాల్గొన్నారు.