SAKSHITHA NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల కళాశాలలో
డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన


సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యాపేట జిల్లా)
చిలుకూరు పిఎస్ పరిది
ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్సై రాంబాబు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మరియు కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
SI రాంబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై100 కుసమాచారం ఇవ్వాలని తెలిపినారు.


వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమం నందు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మమ్మ, ఏఎస్ఐ ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ సురేష్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, నాగార్జున,గురులింగం,చారి, మరియు ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS