SAKSHITHA NEWS

మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అమ్మ ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు

ఇద్దరు మహాత్ములు సమాజానికి ఆదర్శం బి యస్ నారాయణరెడ్డి యస్ తిరుపతమ్మ

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం కొంగలవీడు రోడ్ పురాతన వెంకటేశ్వర స్వామి గుడి నూతన అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న అమ్మ ఆశ్రమం నందు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గిద్దలూరు ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి చంద్రశేఖర్ ముడియం వెంకట్రామిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్రాంత పంచాయతీ సెక్రటరీ దామిరెడ్డి నారాయణరెడ్డి కి, అమ్మ ఆశ్రమం అభివృద్ధి కోసం కృషి చేసిన మానం ఉమాలను ఘనంగా సత్కరించారు. అమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు ఆరోగ్యవంతంగా ఉండడానికి చక్కటి పండ్లు ఎల్ఐసి వారు పంపిణీ చేశారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ కృషి చేశారన్నారు. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారన్నారు.మానవుడు ఎంత ఎత్తు ఎదిగినా అభివృద్ధికి నిరోధకంగా ఉండి ఇతరులకు సహాయం చేసే గుణం లేకుంటే దానివలన మానవాళికి సమాజానికి మనిషివల్ల లాభం లేదన్నారు. సామాన్య మనిషిగా ప్రజల కోసం విశ్రాంత ఉద్యోగినిగా ఉండి సిరిగిరి తిరుపతమ్మ అమ్మ ఆశ్రమాన్ని నెలకొల్పి కుటుంబం ఆదరణ కోల్పోయినటువంటి భారత భూమిలో ఏ ఒక్క స్త్రీ, పురుషులు అనాధగా ఉండకూడదని ఆశ్రమం నెలకొల్పి సంపాదించుకున్న ఆస్తిని ఆశ్రమానికి పెట్టుబడిగా పెట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. దానికి ఉదాహరణ ఆమెలో ఉండే భారతదేశం మీద ఉండే ప్రేమ పెద్దల మీద ఉండే గౌరవం అని కొనియాడారు. ఆపదలో ఉన్న అనాధ వృద్ధులను ఆదుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఉద్యోగులను ప్రజాప్రతినిధులను ఆధ్యాత్మిక వ్యక్తులను సమాజ సేవకులను సామాజిక స్పృహ కలిగిన స్త్రీ పురుషులను సభ్యులుగా చేర్చుకొని అమ్మ ఆశ్రమాన్ని ముందు ముందు రోజులలో అభివృద్ధి పథంలో ఉండడానికి ఉపయోగపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు, రాచర్ల ఉదయ్ ఛానల్ విలేకరి షేక్ ఖాదర్ వలీ, గిద్దలూరు ఎల్ఐసి బ్రాంచి లియాసి సంఘం అధ్యక్షులు డి నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఏ బాబు, బాల చెన్నయ్య మాజీ కౌన్సిలర్, మానం ఉమ, పావురాయి సునీత,మేకల బయన్న బెల్దారి, బ్రంహారెడ్డి ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS