పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్
పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు
ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో వచ్చిన 500 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలు పంపిణి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ *
అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు
- అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల 500 మంది లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి , ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి , దానం నాగేందర్ , ప్రకాష్ గౌడ్ , మాగంటి గోపీనాథ్ ,కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి ఇళ్ల పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంతో పారదర్శకంగా ఎంపికైన అర్హులైన 500 మంది లబ్దిదారులకు ఇండ్ల పత్రాలను అందించడం చాలా సంతోషకరమైన విషయం అని , ఆత్మ గౌరవ ప్రతీక అని , ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని , పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక పథకాలలో ఒకటి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అని అన్నారు.
పేదలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు తెలియచేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు దశల వారిగా అందచేయడం జరుగుతుంది అని ,లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందచేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అర్హులైన నిజమైన లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా ,పారదర్శకంగా ఉండేలా చూసి నిజమైన లబ్ధిదారులకు అవకాశం కలిపించి ఇండ్లు కెటయించేలా చేయడం జరిగినది అని, అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. మిగిలిన వారికి విడతల వారిగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల
కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పేదవారు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఇళ్ళు కట్టించడం జరిగిందని మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందని ఈ ప్రక్రియ ఇండియాలో మొదటి సారిగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో ఆసుపత్రి, పాఠశాల , అంగన్ వాడి , దేవాలయం, చర్చి, మసీదు వంటి ప్రార్థన మందిరాలను నిర్మించాలని , రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్ లను ఏర్పాటు చేయాలని ,అన్ని రకాల మౌలిక వసతులు కలిపించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపించాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని మంత్రి హరీష్ రావు ని కోరడం జరిగినది. దీనికి స్పందించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆసుపత్రి, పాఠశాల , అంగన్ వాడి,ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్ సౌకర్యం కలిపిస్తామని అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హరీష్ రావు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , ప్రసాద్, MD ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు