SAKSHITHA NEWS

Madhira Matur Peta Primary Health Center Contingency

మధిర మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికి
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి
మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

మాటూరు పేట లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకోవడానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మండల మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది

దీనిలో భాగంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించి హాస్పిటల్ లోని రోగులను సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని ప్రజల ఆరోగ్యమే దిశగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వైద్యులు వైద్య సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పని చేయాలని అన్నారు

ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అన్నారు, అనంతరం జిల్లా పరిషత్ నిధుల తో జరుగుతున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మత్తులను పరిశీలించి పనిలో నాణ్యతను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు వైద్య సిబ్బంది, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.


SAKSHITHA NEWS