అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తుంటారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడం, పిల్లల్లో మానసిక ఉల్లాసం కల్పించేలా తరగతులు నిర్వహించడం వారి విధి. ఇవి కాక గ్రామీణ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో వారికి విధులు తప్పవు.ఇటీవల కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా అంగన్ వాడీలకు డ్యూటీలు వేస్తున్నారు. కొందరికి నైట్ డ్యూటీలు కూడా చేశారని, గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గర్భవతుల ను గుర్తించడం, ప్రజలకు వైద్య సలహాలు సూచనలు ఇస్తూ డెలివరీ అయ్యే వరకు వ్యాక్సిన్లు ఇంజక్షన్లు మందులు ఇపిస్తూ డెలివరీ అయిన తర్వాత తల్లితోపాటు పిల్లలకు ఏడాదిన్నర వయసు వచ్చే వరకూ టీకాలు, ఇంజక్షన్లు ఇస్తూ తల్లి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పాటు కృషి చేస్తూ, ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రులకు తీసుకేలెందుకు చాలా వరకు వారి సహకారం ఉంటుందని తెలిపుతూ వారి శ్రమను గుర్తిస్తూ ఈ రోజు వారికి కలెక్టర్ కార్యాలయంలో శాలువతో సన్మానం చేశారు….
మేడ్చల్ నియోజకవర్గ వివిధ గ్రామాల ఎంపీడీఓ లు, జడ్పీటీసీ లు, మున్సిపాలిటీల చైర్పర్సన్ లు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, మహిళలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు..