SAKSHITHA NEWS

బుజ్జగింపులో భాగంగానే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు బహుమతిగా ప్రజాధనం 195 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.

కామారెడ్డి
న్యాయం న్యూస్ సెప్టెంబర్ 8:

గంప గోవర్ధన్ మాట్లాడిన దానికి షబ్బీర్ అలీ తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.
15 సంవత్సరాల నుండి గోదావరి జలాలు ప్రజలు తాగుతున్నారు సాగునీటి గురించి చెప్పమంటే కమిషన్ల కోసం తాగునీరు గురించి చెప్పుతున్నావ్ కామారెడ్డి ప్రజలను అడుగు ఏ రోజైనా తాగునీటికి ఇబ్బంది కలిగిందా గత 15 సంవత్సరాల నుండి
గోదావరి జలాల పైప్ లైన్లు నాసిరకం ఉన్నాయని అంటున్నావ్ నీకు దమ్ముంటే నీవు మగానివి అయితే
ఆ కాంట్రాక్టర్ అయినా కెసిఆర్ మిత్రుడు మెగా కృష్ణారెడ్డి పై కేసు పెట్టు చర్యలు తీసుకోని మగాడివని నిరూపించుకో. గోదావరి జలాల కాంట్రాక్టు చేసింది మెగా ఇంజనీరింగ్. ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్.కంపెనీ యే.
రాష్ట్రం మొత్తంలో కాలేశ్వరం మరియు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ పనులు చేసింది మెగా కృష్ణారెడ్డి మరి మీరెన్ని కోట్లు లంచాలు తీసుకున్నారు
ఎట్టి పరిస్థితిలో ప్రజాధనాన్ని దోపిడీ కానివ్వను ఎంతవరకైనా పోరాడుతాం
కెసిఆర్ కుటుంబం మరియు ని దోపిడీని ఎండగడతాం
15 సంవత్సరాలలో నీవు చేసిన అవినీతిని దోపిడిని ప్రజల్లో తీసుకెళుతున్నందుకే పిరికిపందల పారిపోతున్నవ్ రాష్ట్రంలోనే అభివృద్ధి చేయడం చేతగాని నంబర్ వన్ ఎమ్మెల్యే వు నీవే.నీ పనితనం చూసే నిన్ను పక్కన పెట్టారు
కామారెడ్డి ప్రజల అదృష్టం కేసిఆర్ ను
ఓడించే అవకాశం వచ్చింది కామారెడ్డి గడ్డ పౌరుషమేంటో ఓటు ద్వారా కేసిఆర్ నూ ఓటమి రుచి చూపిస్తాం ఎటు గాని ఎమ్మెల్యే వు నీవు డబల్ బెడ్ రూమ్ పరిశీలనకు వస్తాను అని పారిపోయావు. గ్రామాల అభివృద్ధి చూపిస్తానని వీపు చూపించావు. అభివృద్ధిపై మాట్లాడే హక్కు కోల్పోయావు .కమిషన్ల గురించి బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది కమిషన్ల కు కక్కుర్తి పడి డబుల్ బెడ్ రూమ్ లు కట్టారు అవి కూలిపోయే స్థితికి ఉన్నాయి రామేశ్వరం పల్లిలో కట్టారు అవి నీటిలో మునిగిపోతున్నాయి.

మీరు ఎవరికైతే ఆఇండ్లు అలార్ట్ చేశారో వాళ్లని అడగండి కమిషన్ల గురించి
దళిత బంధులో కమిషన్లు బీసీ బందులో కమిషన్లు కమిషన్లు మైనార్టీ బందులో కమిషన్లు మీ మొత్తానికి మీ ప్రభుత్వమే 30% కమిషన్ ప్రభుత్వంగా దేశము మొత్తం చెబుతుంది స్వయంగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు మా ఎమ్మెల్యేలు దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నారని ఆ లిస్టునావద్ద ఉందని మీ నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు అందులో నీ పేరు కూడా ఉందని మొత్తం కామారెడ్డి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అన్ఫిట్ ఎమ్మెల్యేవు ఆని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు
నీ రాజకీయ జీవితానికి నీవు పులి స్టాప్ పెట్టుకున్నావు ఇక నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
నేను మూడుసార్లు ఓడిపోయాను అది కూడా అభివృద్ధి చేయకుండానో. అవినీతి చేయడం ద్వారా ఓడిపోలేదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సెంటిమెంటు మాత్రమే తెలంగాణలో అందరికంటే తక్కువ మెజార్టీతో ఓడిపోయాను అంతే తప్ప అందులో నీ గొప్పతనం ఏమి లేదు నువ్వు చేసిన అభివృద్ధి చూసి నిన్ను గెలిపియలేదు నిన్ను గెలిపించింది తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే అని అన్నారు.


SAKSHITHA NEWS