SAKSHITHA NEWS


Light in the lives of the poor with Asara Pension Scheme

ఆసరా పింఛన్ల పథకంతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు…

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం…

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు రాబోవు కాలంలో ప్రజలు గుణపాఠం చెప్పాలి…

గాజులరామారంలో 1142 మందికి పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన 1142 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గాజులరామారంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఆసరా ఫింఛన్లను అందిస్తామని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఆసరా పింఛన్ల పథకంతో నిరుపేదలు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని అడిగారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు సీఎం కేసీఆర్ ని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. రాబోవు కాలంలో ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసీ ప్రశాంతి, సీనియర్ నాయకులు ఇంద్రసేన గుప్త, రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పెద్దబాల్ అంజన్ గౌడ్, హుస్సేన్, ఆబిద్, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఏజిపి కమలాకర్, నవాబ్, సింగారం మల్లేష్, మసూద్, ఇబ్రహీం, చందు ముదిరాజ్, చెట్ల వెంకటేష్, మూసాఖాన్, ఇమ్రాన్ బైగ్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS