SAKSHITHA NEWS

Leverage increased with B.R.S Sabha”

బి.ఆర్.యస్ సభతో పరపతి పెరిగిన తుమ్మల”
నూతన ఉత్తేజంతో కార్యకర్తలు

లోడిగ వెంకన్నయాదావ్ -సామాజిక వెత్త. పాలేరు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కలిసొచ్ఛే రాత ఉంటే నడిసొచ్ఛే కొడుకు పుడతాడంట. ఇది తుమ్మలగారి కొసం పుట్టిన సామెతలా ఉంది. రాష్ట్ర దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఖమ్మం వేదిక గా మారాయి.
ఖమ్మం చరిత్రలోనే బి.ఆర్ .యస్ ఆవిర్భావ సభ ఒక చరిత్ర గా అభివర్ణించవచ్ఛు. ఇది ఒక సువర్ణ అద్యయనంలా లిఖించబడుతుంది అని అనుకొంటే మరో ప్రక్క అభివృద్ధి ప్రదాత కు కలిసి వచ్ఛిన సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. పదవుల కోసం పైరవీలు చేసే గుణం కాదు తుమ్మలగారిది.

నా అవసరం ఉంటే నన్ను ఉపయోగించుకొంటారు.లేకుంటే నేను ఇంటివద్ద వ్యవసాయం చేసుకొంటాను అని అనేక పర్యాయాలు తన సన్నిహితుల వద్ద చెప్పుకొనే తుమ్మల తన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇదే సూత్రాన్ని పాటించి జిల్లాకు ఆదర్శప్రాయుడైన రాజకీయ నాయకుడిగా నిరూపించుకొన్నారు. అదే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. పదవులకు ఆశపడకుండా, పైసలకు కక్కుర్తి పడి ఆస్తులు కూడబెట్టకుండా తొలకని నిండు కొండలా నికాసైన నాయకుడిగా , రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి గా ఖమ్మంజిల్లా రాజకీయాలాలో తనకంటూ ఒక చరగని ముద్ర వేసుకొన్నారు తుమ్మల నాగేశ్వరరావు .

ఆ నిబద్దతే ఇప్పుడు తుమ్మలకు కలిసి వచ్ఛిందిఅని చెప్పవచ్చు. డబ్బులు పంచిపెట్టే రాజకీయాలు ప్రజలను మభ్యపెడుతు అవసరం ఉన్నప్పుడల్లా ప్రజలకు డబ్బును ఎరగా చూపించే రాజకీయాలు తుమ్మలగారికి అసలు ఇష్టముండదు. ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలు , ఆర్థిక ప్రగతి, దేశాభివృద్దే తన ప్రాణంగా పనిచేసి ప్రజలచేత అభివృద్ధి ప్రదాత అని పించుకొన్నారు తుమ్మల. డబ్బురాజకీయాలు ,కుల రాజకీయాలు ప్రజాస్వామ్యంలోకి చొరపడ్డాయి. ఇది కొంత తుమ్మలని ఇబ్బంది పెట్టిన రాజకీయాలు అయినప్పటికీ ఖమ్మంజిల్లా రాజకీయాలలో ఇలాంటి వారు ఎక్కువ కాలం నిలబడలేరు అన్న నమ్మకంతో తుమ్మల మౌన ముద్రదాల్చి కాలం సమాదానం చెపుతుంది అని, తనని నమ్మిన కా‍ర్యకర్తలను కాపాడుకొంటు తనదైనశైలిలో ముందుకు సాగారు.

దీనిలో భాగంగానే ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులచేత 40 సంవత్సరాల రాజకీయ ఆత్మీయ సమ్మేళనం సుమారు 40 వేలమంది తో జరుపుకొనటం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తనయొక్క రాజకీయ అవసరాన్ని రాష్ట్రంలో జిల్లా లో తనవైపు చూసేలా చేసింది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే బి.ఆర్.యస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం, పొంగులేటి పార్టీని వీడుతుండటం ఒక్కసారిగా తుమ్మల ప్రాధాన్యతను పెంచాయి. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కి కేసీఆర్ రంగంలో దిగి తుమ్మలను తెరపైకి తెచ్ఛారు.

అందివచ్ఛిన అవకాశం అందిపుచ్ఛుకొని సభను విజయవంతం చేయటానికి తనవంతు కృషిగా హరీష్ రావు తో జిల్లా నలుమూలలు తిరిగి తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరిచి ఒక్కసారిగా ఖమ్మంజిల్లా రాజకీయలను తనవైపు చూసుకొనేలా చేసుకొనగలిగారు తుమ్మల. నేను ప్రజలకు సేవ చేయడానికి కేసీఆర్ ను నమ్ముకొన్నాను నాకు కేసీఆర్ ద్రోహం చేయడు అని తుమ్మల తన సన్నిహితుల వద్ద తరచు చెప్పిన మాట ఇప్పుడు నిజం అయ్యేలా కనిపిస్తుంది. కేసీఆర్ వద్ద తనపూర్వ అనుభవం తుమ్మల నమ్మకానికి నిదర్శనమైతే ఖమ్మంజిల్లా రాజకీయాలలో తుమ్మల చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది.

తుమ్మలను వదులుకొంటే ఖమ్మంజిల్లా బి.ఆర్. యస్ పార్టీ చేజారుతుంది అని నిఘావిభాగాల ద్వారా రహస్య సమాచారం కేసీఆర్ కు అందినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాలోని యం.యల్.ఏలు , యం.పి.లు,మంత్రులు వెంటబెట్టుకుని హరీష్ రావుగారు తుమ్మల ఇంటికి హుటాహుటిన వెళ్ళడం ,ఆతర్వాత తుమ్మలగారిని ఉభయ జిల్లా లో అన్ని నియోజకవర్గాల్లో తిప్పడం పార్టీ ఆవిర్భావ సభ బాద్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి.

దీన్ని బట్టి తుమ్మల రాజకీయ పరపతి ఒక్కసారిగా ఎలా పెరిందో అర్థం చేసుకొనవచ్ఛు. తద్వారా రాజకీయ పరిణామాలు ఎలాఉన్నా తుమ్మల సేవలు జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాలలో కేసీఆర్ ఉపయోగించే అవకాశం మెండుగా కనపడుతున్నాయి. యం.యల్ .సి ద్వారా రాష్ట్ర మంత్రి చేస్తారా , లేక రాజ్యసభ ద్వారా దేశ రాజకీయాలలో తన వెంట తుమ్మలను ఉంచుకొంటారా వేచిచూడాలి. బి.ఆర్ యస్ పార్టీ దేశ విస్తరణలో కీలక బాధ్యతలతో ఉంచుతారా అన్నది అటుంచితే తుమ్మల సేవలు ఉపయోగించే అవకాశం సుస్పష్టం గా కనిపిస్తుంది.

కేసీఆర్ ఏబాద్యత ఇచ్ఛిన తుమ్మల ఇది వద్దు ,అది కావాలి అనే గుణం తుమ్మల దికాదు కాబట్టి కేసీఆర్ కు నచ్ఛిన విధంగా అధికార పదవులు ,పార్టీ పదవులు ఏకకాలంలో తుమ్మలను వరించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఖమ్మం సభ తమ్మల భౌషత్ కొరకు కార్యకర్తల నూతన ఉత్తేజం మరియు మారుతున్న రాజకీయ పరిణామాల కు అడ్డుకట్ట గా బి.ఆర్. యస్ సభ నిలుస్తోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.


SAKSHITHA NEWS