Let’s work to solve the problems one by one: Vikarabad MLA Dr. Metuku Anand
ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని, ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.
మురుగు కాలువల నిర్మాణానికి మరియు గ్రామంలోని తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.
నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
గ్రామంలో 1,2,5,8వ వార్డులలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, ప్రజలు చెర్రలు తీయరాదని సూచిస్తూ… మిషన్ భగీరథ నీటినే త్రాగాలన్నారు, అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, నూతన ట్రాన్స్ఫర్మార్ ఏర్పాటు చేసి, గ్రామంలో అవసరమైన చోట ఇంటర్ ఫోల్స్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.
బస్వాపూర్ గ్రామంలో వివిధ కారణాలు వల్ల మరణించి రైతు కుటుంబాలకు రైతు భీమా పథకం నుండి 35 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు.
ప్రజలందరూ.. ఎలాంటి అపోహాలు లేకుండా 3వ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు.
మరుగుదొడ్లు ప్రతి ఇంటికి కచ్చితంగా నిర్మించుకొని వాడుకలో ఉంచాలని ప్రజలకు సూచిస్తూ.. ఇంకుడు గుంతలన్నిటికి నిధులు మంజూరు చేయాలని, అధికారులను ఆదేశించారు.
అనంతరం బస్వాపూర్ గ్రామంలో 33 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.