వైకుంఠపురం వెంకటేశ్వర ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న వైకుంఠపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం వైకుంఠపురంలో వెలసిన అలివేలుమంగ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయని.. ఎంపీ నిధుల నుంచి మరో రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. వాటితో పాటు దాతల సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
వైకుంఠపురం ఎంత మహిమగల పుణ్యక్షేత్రమని.. పక్కనే ఉన్న కృష్ణాతీరం వల్ల పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. అందు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అంతకుముందు సతీమేతంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలోను, గ్రామంలో ఉన్న మరో ఆలోయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.