పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జగన్నన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన *పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ,ఆర్ధిక,ఆస్తి తగాదాలు,ఉద్యోగ మోసాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.
గండిగనుమల గ్రామం బొల్లాపల్లి మండలానికి చెందిన రామావత్ లక్ష్మీ నాయక్ అను అతను తనకి గల నాలుగు ఎకరాల పొలానికి సంబంధించి పక్క పొలంలో గుండా ఆరు అడుగుల లోతులో పైపు ద్వారా నీటిని తెచ్చుకుంటుండగా సదరు పొలం వ్యక్తి ఆ పైపు తీసేయమని ఇబ్బంది పెడుతున్నాడని తనకు న్యాయం చేయమని ఫిర్యాదు, కోనూరు గ్రామం అచ్చంపేట మండలానికి చెందిన శాఖమూరి శ్రీనివాసు అను అతను తన పొలంలో మొక్కజొన్న నువ్వులు జొన్న పంటలు వేయగా అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ట్రాక్టర్లతో దున్ని నష్టం కలిగించారని పంట నాశనం చేశారని తగిన న్యాయం చేయాలని ఎస్పీ ని ఆశ్రయించినారు.
రెంటచింతల గ్రామం మరియు మండలానికి చెందిన నాగేండ్ల వెంకటేశ్వర్లు అనునతను సుమారు రెండు సంవత్సరాల నుండి ఇద్దరు వ్యక్తులు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పగా వారికి ఫోన్‌పే ద్వారా సుమారు 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు అప్పటినుండి ఇప్పటివరకు వారు ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తగిన న్యాయం చేయమని ఎస్పీ కి ఫిర్యాదు చేశారు, జగనన్నకి చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి,నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు, స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయసహకారాలు అందించారు.
స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్పీతో అదనపు ఎస్పి( అడ్మిన్) ఆర్. రాఘవేంద్ర, ఏఆర్ అదనపు ఎస్పి డి రామచంద్ర రాజు, ఏ ఆర్ డి ఎస్ పి G. మహాత్మాగాంధీ రెడ్డి , దిశ డీఎస్పీ M. సుధాకరరావు , , సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.