SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను నిరశిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ ఈ నెల 28వ తేదీ న జరిపే పూలే, అంబేద్కర్ జన జాతర సభను జయప్రధం చేయాలని కెవిపియస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య లు విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో నాడు అంబేద్కర్ సెంటర్ లో సామాజిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్ జన జాతర కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో యస్ బీ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఈ సభలో రాష్ట్ర, జిల్లా మేధావుల ప్రసంగాలతో పాటు ఆట, పాట, మాట వంటి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించే ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం, కెవిపియస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ తదితర నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శేపూరి సుదర్శన్, బి యస్ పి మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పోకల ఎలిజబిత్, సిపిఐ నాయకులు బొలుగూరి లింగయ్య, సిపిఎం మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, రుద్రారపు పెద్దులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడ శ్రీను, యం ఆర్ పీ యస్ నాయకులు పాల క్రిష్ణ, కెవిపియస్ జిల్లా నాయకులు ఈ సం రాజు, బొడ్డు బాబు రావు, రజక సంఘం జిల్లా నాయకులు ఐతరాజు యాదయ్య, వివిధ ప్రజా సంఘాల, సామాజిక సంఘాల నాయకులు కొంపెల్లి అశోక్, అక్కనపల్లి నాగయ్య,యల్లంల వీరయ్య, గ్యార శేఖర్, ఎల్లేష్, దాసు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 25 at 5.51.55 PM

SAKSHITHA NEWS