కార్మిక హక్కులకై ఉద్యమిద్దాం.. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష పిలుపు
*సాక్షిత వనపర్తి :
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను కార్మికులు సంఘటితంతో ప్రతిఘడించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏఐటీయూసీ ( AITUC) కార్యాలయంలో ఏఐటీయూసీ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు పనిగంటలు పెంచే విధంగా నిర్ణయాలు అమలు చేసిందన్నారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని నేడు బిజెపి ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అసంఘటిత రంగంలో కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని కార్మికుల భద్రతను బిజెపి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కార్మికుల అందరికీ పిఎఫ్. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నేషనల్ మానిటర్ పైప్ లైన్ (NMP) పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగార్చి ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు.
సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని సెకండ్ ఏఎన్ఎం ల పోస్టులు పెంచాలని.డిమాండ్ చేశారు. మరోవైపు ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా నేటికి కూడా ప్రభుత్వ హామీ నెరవేరలేదన్నారు.. గిరాకీలు లేక ఆటో కార్మికుల జీవితాలు దుర్బలంగా ఉన్నాయని. తెచ్చిన అప్పులకు ఈఎంఐలు కట్టలేక ఆటో కార్మికులు ఆందోళనలో ఉన్నారన్నారు.. రాష్ట్రంలో మినిమం పే స్కేల్ అమలు కావడం లేదన్నారు. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు నందు సైట్ ఓపెన్ కాకపోవడంతో చాలామంది బిల్డింగ్ కార్మికులు సంక్షేమ నిధులకు దూరమవుతున్నారన్నారు.. తక్షణమే ఆగిపోయిన సైట్ ను ఓపెన్ చేసి పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.. ఆల్ హమాలి వర్కర్స్ కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. స్వీపర్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మిషన్ భగీరథలో ఏజెన్సీలదే ఇష్టారాజ్యంగా మారిందని. ఏజెన్సీలను ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు. షాపింగ్ మాల్ లలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రత కల్పించి శ్రమ దోపిడిని అరికట్టాలన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు..పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AITUC గౌరవ అధ్యక్షులు భరత్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి.ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ఉపాధ్యక్షులు శ్రీరామ్. లక్ష్మీ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.