పుట్టపర్తిలో ఐటిమంత్రి నారా లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలుకుదాం
పుట్టపర్తి నియోజవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు
నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..
పుట్టపర్తి :08
రాష్ట్ర విద్యాశాఖ ,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పర్యటనను (రేపు) గురువారం సాయంత్రం4:00 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు విచ్చేస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి పుట్టపర్తి నియోజవర్గ ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కొత్తచెరువు, ధర్మవరం మీదుగా అనంతపురంలో జరిగే నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం “డాకు మహారాజ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్” లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ,కొత్త చెరువు మీదుగా రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ కిశోరం నారా లోకేష్ బాబు రోడ్డు మార్గాన అనంతపురం కు వెళ్తున్న సమయంలో టీడీపీ, బిజెపి, జన సేన కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని వారు కోరారు.
అదేవిధంగా ఈవెంట్ కు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ,పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు అతిరథ మహారథులు ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొంటారు.
కావున తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,మాహిళలు ,నారా లోకేష్ బాబు కి కొత్తచెరువు మండలం సర్కిల్ నందు ఘనంగా స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు.
అలాగే పుట్టపర్తి నియోజకవర్గం స్థానిక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి.