ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఇటీవలే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజా గా,సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి చట్టబద్ధత లభించింది.
కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం- 2009లో తెలంగాణ లోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యా లయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఈనెల7వ తేదీన లోక్సభ,13వ తేదీ న రాజ్యసభ ఆమోదిం చాయి.
దాంతో ఆ బిల్లుకు నిన్నటి రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు అది చట్టరూపం దాల్చింది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం- 2014లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పా టు చేస్తున్న విషయం తెలి సిందే. ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ మొత్తాన్ని కేంద్ర విద్యా శాఖ బడ్జెట్ రూపంలో అం దించనున్నట్లుతెలుస్తుంది..