చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం కంటి వెలుగు పథకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరమని ఆయన తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కంటి వెలుగు పథకంలో మంజూరు అయిన కంటి అద్దాలను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సంధర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు . దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా ,అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి,వారికి అవసరం అయిన కంటి అద్దాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ గొప్ప పథకమని కొనియాడరని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం గా కొనసాగిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణురాలు డా. స్రవంతి, ఆప్తమాలాజిస్ట్ పద్మ, ఎఎన్ఎం పద్మ, ఆశ వర్కర్లు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, పొలగొని స్వామి, కంచర్ల జన్నారెడ్డి, ఉయ్యాల నరేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.