SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో,ఏదేచ్ఛగా కొనసాగుతున్నటువంటి భూ
ఆక్రములకు, కాంగ్రెస్ పార్టీ కి గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు గానీ, ఎటువంటి సంబంధం లేదన్నారు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు పెద్దలు కె.యం.ప్రతాప్ , తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు భూఆక్రములను ఎట్టి పరిస్థితులలో సహించేది లేదన్నారు, ఎవరిని గాని ఉపేక్షించేది లేదన్నారు, ప్రభుత్వం ఎలాంటి ఆశ ఆకాంక్షలతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాదు నగరం చుట్టూ ముట్టు కూడా అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో,సంకల్పంతో ప్రభుత్వం యొక్క శాఖలైనటువంటి సునామీ,స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దిల్ అనే సంస్థకు, చిన్న, పెద్ద పరిశ్రమల కొరకు స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, పేద ప్రజలకు రెండు మూడు లక్షలకు అమ్ముకున్నారు, భూ కబ్జాదారుల ఆగడాలను అధికారులు అరికట్టలేకపోయా రన్నారు.
చిన్న దొంగగా ఉన్నప్పుడు చర్యలు చేపట్టకపోతే గజదొంగ గా మార్తాడని అన్నారు.
ఇటువంటి కబ్జాదారులపై పిడి యాక్ట్ ప్రయోగించాలన్నారు.


కబ్జా స్థలాలనుకుంటున్న అమాయక ప్రజలు, భూ కబ్జాదారుల చేతులలో పడి ధనాన్ని పోగొట్టుకుంటున్నారన్నారు.
పేద ప్రజలు నష్టపోకుండా భూకోబ్జాదారుల నుండి డబ్బులు వసూలు చేసి అమాయక ప్రజలకు ఇప్పించే ప్రయత్నం చేయాలన్నారు.
హరితహారం లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 80000 మొక్కలను నాటారు, భూ ఆక్రమణదారులు పెరిగినటువంటి చెట్లను నరికివేసి షెడ్యూలను నిర్మించి వ్యాపారం చేస్తున్నారు.
సుందరీకరణ కొరకు, పాదాచారుల కోసం జిహెచ్ఎంసి కోట్ల రూపాయల తో ఫుట్పాతులను నిర్మిస్తే, వాటిని కూడా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు, అధికారులకు కళ్ళు కనిపించడం లేదా అన్నారు? సామాన్యులకు( పాన్ డబ్బా ) ఒక న్యాయం సంపన్నులకు( మహీంద్రా కంపెనీ ) ఒక న్యాయం ఉండకూడదన్నారు, అందరికీ ఒకే న్యాయం జరగాలన్నారు, ఫుట్ పాత్ ఆక్రములను వెంటనే తొలగించాలన్నారు.


SAKSHITHA NEWS