
కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) నూతన కార్యవర్గ సభ్యులు….
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 132 – జీడిమెట్ల డివిజన్ వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన ఎం. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్ చక్రవర్తి మరియు కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… నూతన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులకు నా అభినందనలు. కాలనీవాసులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు కాలనీ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) అభివృద్ధికి నా వంతు సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గం పేర్లతో రూపొందించిన లెటర్ హెడ్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివాధన్, సభ్యులు శ్రీశైలం, రమేష్, మారుతి, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
