‘కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటన…
గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 బస్తీలలో పాదయాత్ర..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: జాబ్ మేళా పేరిట హడావుడి చేసిన ఎమ్మెల్యే వివేకానంద్ యువతకు ఏయే కంపెనీల్లో, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడో శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ డివిజన్ లోని గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 లో పాదయాత్ర చేపట్టారు. బస్తీలలో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ వెంట నడిచారు. స్థానికంగా ఉన్న సమస్యలను శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకరాగ, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గణేష్ నగర్ లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ చార్జీలు,ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, నల్ల బిల్లులు అన్ని పెరిగాయని అన్నారు. పేదలకు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అసమర్థత వల్లే బస్తీలలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్, సీనియర్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, నటరాజ్ గౌడ్, కృష్ణ యాదవ్, దయాకర్, లింగం యాదవ్, అలివేలు, దుర్గారావ్, వెంకటేష్ యాదవ్, సత్యం, భూషణం,రవి, కిరణ్, నందకిషోర్, ముద్దం రవి, ఉమామహేశ్వర్, నగేష్ గౌడ్, రాము, పురుషోత్తం, అశోక్, సురేందర్, శ్రీనివాస్, ఎల్లారెడ్డి, శంకర్, ప్రసాద్, సుధాకర్, ప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు