ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా!
*మాణిక్య నగర్, మధుసూదన్ రెడ్డి నగర్, ద్వారకా నగర్, డీ నగర్ లలో పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ డివిజన్ లోని మాణిక్య నగర్, మధుసూదన్ రెడ్డి నగర్, ద్వారకా నగర్, డీ నగర్ బస్తీలలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో పాటు శ్రీశైలం గౌడ్ వెంట నడిచి, ఆయనకు మద్దతును తెలియజేసారు. ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని, నీరు ఇండ్లలోకి చేరుతుందని స్థానికులు మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. బస్తీల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాని, వారికి భరోసా కల్పించి వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న ప్రగతియాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమి లేదన్నారు. బీజేపి ప్రభుత్వం రాగానే బస్తీల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ , బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్, సీనియర్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, నటరాజ్ గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, డివిజన్ ఇంచార్జులు కృష్ణ యాదవ్, బిల్లా వెంకటేష్, ద్వారకా నగర్ కాలనీ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి, నాయకులు అలివేలు,లింగం యాదవ్, విజయ్ గుప్తా, రవి, కిరణ్,వెంకటేశ్వర్ రావ్, నంద కిశోర్, శ్రీధర్, ప్రవీణ్ చారి, వీరేందర్ గుప్తా, వెంకటేష్ యాదవ్, కృష్ణ, కిరణ్ యాదవ్, వికాస్, నర్సింహా చారి, ఉమా మహేశ్వర్, నగేష్ గౌడ్, శ్రీనివాస్, సిద్దార్థ, కార్యకర్తలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.