SAKSHITHA NEWS

KURNOOL 4 TOWN POLICE STATION CRIME NO 532/2022.

కర్నూల్ 4 పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 
532/2022. U/S 302.201. R/w 34. ఐపీసీ సెక్షన్ 3(2) (V)అఫ్ ఎస్సీ ఎస్టి (POA)యాక్ట్ 

సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా 

కర్నూలు నాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 22.12.2022 వ తేదీ రాత్రి శరీన్ నగర్ లోని సవారీ తోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డున వద్ద గాడిబండ ఆమోసు అను వ్యక్తిని కొట్టి చంపి పెట్రోల్ పోసి తగల బెట్టిన విషయములో పోతి తండ్రి అయిన జి, చిన్న నరసన్న, అల్వాల గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1. కుమ్మరి గోపాల్ 2. కుమ్మరి మల్లికార్జున 3. కుమ్మరి శ్రీను 4. కుమ్మరి కిరణ్ 5. కుమ్మరి రవి 6. కుమ్మరి తిరుపతయ్య అను వారి పైన కర్నూల్ నాలుగల పట్టణ పోలీసు వారు కేసు నమోదు చేసినారు.

కర్నూల్ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీ కే .వి . మహేశ్ అయిన నేను మరియు పి.శంకరయ్య, ఇన్స్పెక్టర్ ఒఫ్ పోలీసు, కర్నూల్ నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ సదరు కేసు విచారణలో భాగముగా విచారింగా, కుమ్మరి అరుణ మరియు ఆమోసు 2016 వ సం.లో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొనగ, అరుణ మైనర్ అయినందున అరుణను హోమ్ లో ఉంచి, ఆమోసు పైన కర్నూల్ నాలుగ పట్టణ పోలీసు స్టేషన్ నందు పాస్కో కేసు నమోదు అతనిని రిమాండ్ కు పంపినారు. అరుణ మేజర్ అయిన తర్వాత ఆమోసు, అరుణ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు సంతానము.

 బాబు పేరు అఖిల్ వయస్సు 4 సం.లు. తర్వాత ఆమోసు పోతి, తన భార్య అరుణ ఇద్దరు అల్వాల గ్రామములొ ఉన్నప్పుడూ ఆమోసు పోతి మధ్యం తాగుతూ తన భార్య అరుణను శారీరకముగా, మానసికముగా ఇబ్బంది పెట్టె వాడని, ఆ విషయములో అరుణ, ఆమోసు పోతి ఇద్దరు గొడవ పడి అల్వాల గ్రామము నుండి సుమారు ఒక సం,. క్రితం కర్నూల్ కు వచ్చి ఉద్యగనగర్ ఏరియాలో ఇల్లు బాడుగకు తీసుకొని ఉంటు ఆమోసు పోతి సిటీ స్క్వేర్ మాల్ లోని. బజాజ్ ఎలక్టర్నిక్స్  షోరూమ్ నందు సెక్యూరిటీ గార్డ్ గాను, అరుణ సిటీ స్క్వేర్ మాల్ లోని  జాకెయ్  బట్టల కంపెనీ నందు సేల్స్ గర్ల్ గా పనిచేసేది. 

వీరు ఇద్దరు సూర్య ప్రదీప్ అనే వ్యక్తి యొక్క ఆటొ డ్యూటీలకు పోయి వస్తూ ఉండేవారు. సూర్య ప్రదీప్, ఆమోసు పోతి  ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మందు త్రాగేవారు. అరుణకు రాత్రి 9.00 గంటలకు డ్యూటీ అయిపోయేది. ఆమోసు పోతి కు రాత్రి 10.00 గంటలకు డ్యూటీ అయిపోయేది. అరుణ రాత్రి 9.00 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత సూర్య ప్రదీప్ ఆటొలో వచ్చేది. ఆ క్రమములో అరుణకు, సూర్య ప్రదీప్ ఇద్దరికీ బాగా చనువు ఏర్పడి, అరుణ తన బాధలు సూర్య ప్రదీప్ కు చెప్పేది.

 అరుణ, సూర్య ప్రదీప్ తో నా భర్త నన్ను శారీరకముగా, మానసికముగా ఇబ్బంది పెడుచున్నాడు, అతని అడ్డు తొలగిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పుట వలన సూర్య ప్రదీప్ తన ప్లాను ప్రకారం తన స్నేహితుడు అయిన జీవన్ సహాయముతో మన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ , ఒక ఫ్యాను కు బిగించే రాడ్డును (తెలుపు రంగు) తీసుకొని ఆమోసు పిలిపించుకొని 22.12.2022 వ తేదీన రాత్రి ముగ్గురు కలిసి శరీన్ నగర్ లోని సవారీ తోట కాలనీ చివర గల హంద్రీ నది ఒడ్డున మందు తాగి సూర్య ప్రదీప్, జీవన్ ఇద్దరు కలిసి రాద్దూ, రాళ్ళతో ఆమోసు తలపైన గట్టిగా కొట్ట చంపి, ఆమోసు పైన పెట్రోల్ పోసి కాల్చినారని నేరము అంగీకరించినారు. ముద్దాయిలు

1. ములకల సూర్య ప్రదీప్, వయస్సు 26 సం. సన్నాఫ్ . మా. రాజు, హౌస్ నెంబర్. 84-55, శరీన్ నగర్, వై. ఎస్. ఆర్. విగ్రహం దగ్గర, కర్నూల్ టౌన్,
2. నేసే జీవన్ కుమార్, వయస్సు 26 సం.లు సన్నాఫ్. బాలకృష్ణ హౌస్ నెంబర్ 85/101-2, శరీన్ నగర్, కల్లూర్ మండలం, కులం: నేసే వృతి: జీవన్ జిరాక్స్ షాపు.
3. కుమ్మరి అరుణ, వయస్సు: 23 సం.లు వర్క్ ఆమోసు సన్నాఫ్  కుమ్మరి గోపాల  హౌస్ నెంబర్.3/17, ఆల్వాల గ్రామము, గోనెగండ్ల మండలం, కులం: కుమ్మరి.

చనిపోయిన వ్యక్తి పేరు

గాడిబండ ఆమోసు, వయస్సు 26 స,.లు సన్నాఫ్ /చిన్న నరసన్న హౌస్ నెంబర్. 3/17, అల్వాల గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా.పై ముగ్గురు ముద్దాయిలను 28.12.2022 వ తేదీన అరెస్ట్ చేసి నేరముకు ఉపయోగించిన 1) ఇనుప రాడ్, 2) రాయి, 3) మృతుడి సెల్ ఫోన్, 4) మన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ , 5) ఒక్క పల్సర్ మోటార్ సైకల్, 6) బబాజ్ ప్లాటిన మోటార్ సైకల్, 7) ఇద్దరు ముద్దాయిల సెల్ ఫోన్ లు కేసు తదుపరి చర్య నిమిత్తము స్వాధీన పరచుకొని, సదరు ముగ్గురు ముద్దాయిలను రిమాండ్ కు పంపదమైనది.

SAKSHITHA NEWS