కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , స్థానిక సమస్యల పై పర్యటించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ కాలనిలో ఇటీవల విద్యుత్ నూతన కరెంటు లైన్ లు వేయటం జరిగింది, ఇందులో భాగంగా ఓ ఇంటికి అనుకొని కరెంటు తీగలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికుల అభ్యర్ధన మేరకు తక్షణమే కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించి సంబంధిత విద్యుత్తు అధికారితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. తక్షణమే స్పందించిన అధికారులు చర్యలు చేపడతామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, మోయిజ్, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.