ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1
హైదరాబాద్:
ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు.
ఈ విషయమై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఇటీవలనే గవర్నర్ ఈ విషయమై అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. దీనిపై రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు.
గవర్నర్ నుంచి వచ్చిన అనుమతి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముంద డుగు వేసింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో నిధుల బదిలీ జరపడం, ఎన్నికల కోడ్ ఉన్న సమ యంలో ఈసీ అనుమతి లేకుండా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ద మని పురపాలక శాఖ అధికా రులు చెబుతున్నారు.
దీనిపై విచారణ జరపాలని ఏసీబీని కోరారు. దీనిపై ఏసీబీ విచారణ ప్రారంభిం చింది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అరవింద్ కుమార్ నిధుల బదిలీకి సంబంధిం చి సీఎస్ శాంతికుమారికి వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు.
అప్పటి పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు తాను నిధులను బదిలీ చేసినట్టుగా చెప్పారు. దీంతో కేటీఆర్ పై ప్రభు త్వం చర్యలు తీసుకొనేం దుకు సిద్దమైంది.