Kotappakonda-Pamidimarru road works at a cost of Rs 70 lakhs
70 లక్షల రూపాయల వ్యయంతో కోటప్పకొండ – పమిడిమర్రు రోడ్డు పనులకు శంఖుస్థాపన
కోటప్పకొండ తిరునాళ్ళ నాటికి సిద్దం చేసేలా ప్రణాళిక : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్ళ నేపథ్యంలో ఈ ఏడాది ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే కోటప్పకొండ – పమిడిమర్రు రోడ్డు పనులకు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని విమర్శించేవారు కోటప్పకొండ ను చూసి మాట్లాడాలి అన్నారు. గతేడాది నరసరావుపేట వద్ద నుంచి కొండ వరకు కొత్త బిటి రోడ్డు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది 70 లక్షల రూపాయల వ్యయంతో కోటప్పకొండ – పమిడిమర్రు రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది అన్నారు.
ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొండకి వచ్చిన వారు… పమిడిమర్రు వయా JNTU కళాశాల మీదగా వినుకొండ రోడ్డుకు వచ్చి నరసరావుపేట చేరుకునేలా రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. అలాగే కొండ దిగువున అర్చ్… కలువ వద్ద శివ కుటుంబ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు
అనంతరం పమిడిమర్రు, కొండకావురు, గురవాయపాలెం, యలమంద బ్రిడ్జిలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన సుబ్బాయమ్మ శ్రీనివాస రావు , సర్పంచ్లు వెన్నపూస నాగిరెడ్డి , దాసరి శ్రీనివాస రావు , ఎంపీటీసీ సేతు , మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాస రావు , గ్రామాల పెద్దలు అధికారులు పాల్గొన్నారు