SAKSHITHA NEWS

Koona Srisailam Goud visited Bhagat Singh Nagar Multipurpose Function Hall.

భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హల్ ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .

ప్రారంభించి ఏడాది దాటినా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనం


సాక్షిత : చింతల్ 128 డివిజన్: భగత్ సింగ్ నగర్ లో నాలుగు కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హల్ ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించి ఏడాది దాటిన ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో, స్థానికుల సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ * స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఫంక్షన్ హల్ ని సందర్శించారు.

ఇదే భవనంలో కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుండంతో వైద్య సిబ్బందికి, ప్రజలకు మూత్ర శాలలు, మంచి నీటి వసతి లేకపోవడంతో గాజులరామారం ఉపకమిషనర్ కి ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే అరకొర వసతులపై నిలదీశారు. తక్షణమే ఉపకమిషనర్ స్పందించి మంచి నీటి ట్యాoకర్ ని తాత్కాలికంగా ఏర్పాటుచేశారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ హంగు ఆర్భాటాలతో మంత్రి కేటీఆర్ ఫంక్షన్ హల్ ని ప్రారంభించి, ఏడాది దాటినా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడాన్ని ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమని అన్నారు. మోడ్రన్ ఫంక్షన్ హల్ అందుబాటులోకి రాకపోవడంతో బస్తీలోని పేద కుటుంబాలు ప్రయివేట్ ఫంక్షన్ హళ్లలో ఫంక్షన్ లు జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పండిందని, ఇది పేదలకు ఆర్థిక భారం అవుతుందని పేర్కొన్నారు.

పదిహేను రోజుల్లో ఫంక్షన్ హల్ ని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకరావాలని డిమాండ్ చేసారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్రత్యేక భవనాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్ ముదిరాజ్, భావి గడ్డ రవి, జిల్లా కార్యదర్శి జగన్ మోహన్ రావ్, డివిజన్ ఇంచార్జ్ సుశాంత్ గౌడ్,

డివిజన్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రెడ్డి, రాజేష్ చారి, నాయకులు భాను చందర్, ప్రతాప్ రెడ్డి, మల్లం శ్రీనివాస్, బిల్లా, సాయిరాంరెడ్డి, ఓరుగంటి అఖిల్ సాయి,ఈశ్వర్ రెడ్డి, ఆదిత్య, ప్రతాప్ రెడ్డి, రాము, లక్మా రెడ్డి, తోకల శ్రీను, షకీర్, నరేందర్, నాగమణి, రామ్ సాయి,మణి, బస్తీ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS