SAKSHITHA NEWS

KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

సాక్షిత శంకరపల్లి : కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా పాఠశాలలో సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవనజ్యోతి మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు చాలా ముఖ్యమని భవిష్యత్తులో మొక్కలు లేకపోతే వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి జీవనజ్యోతి, కొండకల్ పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి, కృష్ణయ్య, అంజిరెడ్డి, కుసుమకుమారి, శ్రీనివాస్, జగదాంబ, జంగయ్య, హరికృష్ణ, మల్లేష్, కవ్వ గూడెం శ్రీను, ఇందిరాబాయి, రాధ, పంచాయతీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Kondakal

SAKSHITHA NEWS