SAKSHITHA NEWS

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సూపర్ మాక్స్ బ్లేడ్ల కంపెనీ వారు గత కొన్ని నెలలుగా ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లించనందున ఉద్యోగుల జీవనం అస్తవ్యస్తంగా మారడంతో వారు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి * ధర్నాలో పాల్గొని వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు తక్షణమే చెల్లించాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు. కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ BRS ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేకు గత కొన్ని నెలలుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలు పడ్డాడం లేదా అని ప్రశ్నించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సూపర్ మాక్స్ ఉద్యోగులను ఆదుకుంటామని భరోసా నిచ్చారు కోలన్ హన్మంత్ రెడ్డి

WhatsApp Image 2023 10 06 at 3.56.42 PM

SAKSHITHA NEWS