SAKSHITHA NEWS

*సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ గ్రంథాలయంలో పాటకులకు స్థలము సరిపోవటం లేదని, గ్రంథాలయ అధికారి కిష్టయ్య సార్ ఆవేదనచెందారు.తాండూర్ లో ప్రభుత్వ, ప్రవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలశాలాలు మొత్తం కలిపి సుమారుగా 20 కళశాలలు ఉంటాయి. కేవలం తాండూర్ టౌన్ లో మాత్రమే,10వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. రోజు లైబ్రరీకీ చాలా తక్కువ మందే చదువుతుంటారు.

ఉన్న గ్రంథాలయ భవనం చిన్నగా ఉన్నది సరిపోవడం లేదని, గతం లో 10 సవత్సరాల క్రితం కొత్త గ్రంథాలయభవనం కొరకు 12లక్షల మంజూరు చేయడం జరిగింది.బిల్డింగ్ కొంట్రాక్టు 10 లక్షల వరకు తీసుకొనిఉండవచ్చునని గ్రంథాలయ బిల్డింగ్ మాత్రము పూర్తి చేయకుండా వదిలి వేశాడు.

తాండూర్ లో ఉన్న BRS, BJP, Congress పార్టీ ల నాయకులు ఒకరి పైన మరొకరు,తిట్టు కోవటం తప్ప గ్రంథాలయ బిల్డింగ్ కట్టక పోవటం గాని, ఆకాంట్రక్టును అడిగే దమ్మున్న నాయకులు, చదువులపైన శ్రద్దచూయించ లేకపోయినారు, MLA, MP, MLC, మంత్రులు కూడా బిల్డింగ్ పూర్తి చేయుటకు వెనుకంజ వేస్తున్నారు, ఎందుకు? అని విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు అనుకుంటున్నారు. కనీసం ఇప్పటి కైనా గ్రంథాలయ బిల్డింగ్ పూర్తి చేయాలని కోరుతున్నారు.


SAKSHITHA NEWS