SAKSHITHA NEWS

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ !

కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఖాయంగా రానున్నారు. ఎవర్ని పెట్టాలన్నదానిపై మోదీ, అమిత్ షా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనేక రకాల సమీకరణాలను ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడ్ని దక్షిణాది నుంచి ఎంపిక చేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఇప్పటి వరకూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరరాజే, సునీల్ బన్సల్ వంటి పేర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. అయితే వీరంతా హిందీ రాష్ట్రాలకు చెందిన వారు. దక్షిణాదికి అధ్యక్ష పదవి వచ్చి చాలా కాలం అయింది. అందుకే ఈ సారి దక్షిణాదికి చాన్సివ్వాలన్న ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు.

దక్షిణాదిలోనూ బలపడాలని చాలా కాలంగా బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ సారి అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇచ్చి మరోసారి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. హైకమాండ్ దృష్టిలో కిషన్ రెడ్డితో పాటు ఆరెస్సెస్ నుంచి వచ్చిన రామ్ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి అత్యంత సీనియర్ నేత. ఆయన మోడీ సమకాలికుడు. కానీ మోడీ ఎదిగిపోయారు. ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన ఉంది.

ఇక ఇటీవల ఆరెస్సెస్ తో బీజేపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మెరుగుపర్చుకోవాల్సిన అత్యవసరం ఉందని ..లేకపోతే ఇబ్బందేనని పునాదులు కాపాడుకోవాలని ఎక్కువ మంది సలహాలిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. మంచి వ్యూహకర్తగా పేరున్న ఆయన పేరు.. గతంలో చాలా సీరియస్ గా అధ్యక్ష పదవికి పరిశీనలోకి పచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఆయన మళ్లీ ఆరెస్సెస్ లోకి వెళ్లిపోవాల్సిన రాజకీయం చూశారు. ఇటీవలే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. అయనకు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే ఈ ఇద్దరిలో ఒకరికి చాన్స్ ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు.


SAKSHITHA NEWS