Kisan Morcha at Nagulavancha sub station on power issues
విద్యుత్ సమస్యలపై నాగులవంచ సబ్ స్టేషన్ వద్ద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేసిన బిజెపి నాయకులు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నాగులవంచ గ్రామం సబ్ స్టేషన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ రైతులకు విద్యుత్ సదుపాయం అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని, రైతులని ఇబ్బంది పెడుతున్నారని, 24 గంటలు కరెంటు అని చెప్పిన కేసీఆర్ కనీసం ఇప్పుడు యాసంగి సీజన్ కి రైతులు భారీ ఎత్తుగా మొక్కజొన్న పంటని సాగు చేస్తున్న తరుణంలో, రోజుకి మూడు నాలుగు గంటలు కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారని, దీనివలన పంట పొలాలుకి నీళ్లు సరైన సమయంలో అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, రైతులకు ఈ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇచ్చి తగిన న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు జిల్లా బిజెపి అధికార కార్యదర్శి, రామిశెట్టి నాగేశ్వరరావు బిజెపి అధికార ప్రతినిధి, పాపట్ల రమేష్ మధిర టౌన్ బీజేపీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఆలస్యం వీరప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పంది కృష్ణయ్య, ఓబీసీ మోర్చా అధ్యక్షులు చింతల తాతారావు,
ఉపాధ్యక్షులు తోటుకూరి పానకాలరావు, బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు కొండా గోపి, మండల కార్యదర్శి ఆయులూరి శ్రీనివాస్ రెడ్డి,బొర్రా శీను, కందిమల్ల నాగేశ్వరరావు సిద్ధార్థ , మంగయ్య, అమర్ నేని విజయ్, బక్క సత్యమూర్తి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.