సుడా పార్క్ లో అధికారులతో కలిసి పర్యటించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి సాధిస్తున్న ఖమ్మం రఘునాధపాలెం మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కృషితో మరో మణిహారం రాష్ట్రంలోనే తొలి బృహత్తర పల్లె ప్రకృతి వనం (ఖమ్మం సుడా పార్క్) సొంతమని సుడా చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ తరహాలో ఖమ్మం వెలుగుమట్ల పార్క్ ప్రసిద్ధి అయితే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా బృహత్తర పల్లె ప్రకృతి వనరులను తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రఘునాధపాలెం లో 14 ఎకరాల్లో సుడా పార్క్ పేరుతో బృహత్ పల్లె ప్రకృతి వనం రూ 2 కోట్లతో దీన్ని అభివృద్ధి చెయ్యడం జరిగింది అన్నారు. జూన్ 11న,2022 న మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా సుడా పార్క్ ప్రారంభించారు. ఖమ్మం నగరానికి అత్యంత చెరువలో ఖమ్మం – ఇల్లందు ప్రధాన రహదారి పక్కనే ఈ పార్కు ఉండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 6 ఎకరాల్లో ట్యాంక్ బండ్, 8 ఎకరాల్లో ప్లాంటేషన్, పర్యావరణాన్ని కాపాడేందుకు 23 వేల మొక్కలు సుగంధాన్ని వేదజల్లే అనేక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు.
వివిధ ఆకృతుల్లో చెట్లు,పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, పెద్దల ఫిట్నెస్ కోసం వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ వంటి ఈ అందాల చూడతరమా అనిపించే బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్, వాటర్ ఫౌంటెన్లు ఇలా ఎన్నో ప్రజలకు ఆనందాన్ని కలిగించే అంశాలు ఈ పార్క్ సొంతం చేసుకుంది.
డ్రిప్ సిస్టం ద్వారా ప్రతి రోజు చెట్లకు నీరు అందించాలని, వేసవి వచ్చినందున ఒక్క చెట్టు కూడా ఎండిపోకుండా తాగు చర్యలు తీసుకోవాలనీ సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు జెడ్పి.సి.ఓ అప్పారావు,రఘునాధపాలెం మండల ఎం.పీ.డీ.వో రామ కృష్ణ, రఘునాధపాలెం మండల నాయకులు గుడిపూడి రామారావు,పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు..