SAKSHITHA NEWS


Khabaddar are the politicians who are looking narrowly at tabloids and YouTube channels

చిన్నపత్రికలపై,యూట్యూబ్ ఛానల్ పై చిన్న చూపు చూస్తున్న రాజకీయ నాయకుల్లారా ఖబడ్దార్

సాక్షిత తెలంగాణ ప్రతినిధి. : రాజకీయ నాయకులకు కలం తోనే తగిన గుణపాఠం చెప్తాం.అక్షర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. షేక్ హబీబ్. ఉపాధ్యక్షుడు.

కే రామకృష్ణ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో అక్షర పింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హబీబ్ అహ్మద్. ఉపాధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షున జరిగిన ప్రెస్ మీట్ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలోని రాజకీయ నాయకులు చిన్న పత్రికలను.

యూట్యూబ్ ఛానల్ పత్రికా మిత్రులను తమ సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ప్రెస్ మీట్ లు పెట్టి పిలవడం అధిష్టానానికి తమ రాజకీయ ఉనికిని కలం తో తెలియజేయాలని కోరి తమ గురించి న్యూస్ వేయించుకొని. అవసరం తీరాక చిన్న పత్రిక. ఆన్లైన్ పేపర్లు. యూట్యూబ్ ఛానల్ అంటూ అవహేళన చేస్తూ విలేకరులను అవమానించడం. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా అవమాన పరుస్తున్నారు. ఈ పద్ధతి సరి కాదని అలాంటి వారికి గుణపాఠం తప్పదని అక్షర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్. హబీబ్ అహ్మద్, ఉపాధ్యక్షుడు. కే రామకృష్ణ (రఘు) అన్నారు.


చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్, ఆన్లైన్ పత్రికలపై కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయ నాయకులు చిన్న చూపు చూస్తున్నారని కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చిన్న పత్రికలను చిన్నచూపుచూస్తూమాట్లాడుతున్నారని వారికి తమ కలం తోనే తగిన గుణపాఠం తప్పదని అక్షర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హబీబ్ అహ్మద్.

ఉపాధ్యక్షుడు కే రామకృష్ణ అన్నారు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా, ఎప్పటికప్పుడు న్యూస్ ని చేరవేసేవి చిన్న పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లే అని ఆ సంగతిమరువద్దని.ఇప్పుడు సోషల్ మీడియా లో వచ్చిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయని. ఎంతో పేరును తెస్తున్నాయని చిన్న పత్రికలను యూట్యూబ్ ఛానల్ లను తమ సొంత రాజకీయ భవిష్యత్ కోసం రహస్యంగా మీటింగ్ లు పెట్టి రాజకీయ భవిష్యత్తు కోసం మాయమాటలు చెప్పి వాడుకోవడం సరి కాదని.

వారి న్యూస్ చిన్న పత్రికలలో యూట్యూబ్ ఛానల్ లో వేయించుకొని లబ్ధి పొంది ఇప్పటికీ కూడా లబ్ది పొందుతూ చిన్న పత్రికలపై చిన్న చూపు చూస్తున్నారు. చిన్న పత్రికల వార్లను వారు చేసే ప్రోగ్రాములకు రమ్మని చెప్పి కనీసం కుర్చీలు కూడా వేయకుండా చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్ అంటూ చిన్నచూపు చూస్తున్న నాయకులకు త్వరలోనే కలంతో బుద్ధి చెప్పడం జరుగుతుంది. మాకు రాజకీయ నాయకులు అంటే గౌరవం ఉంది.

కానీ తమ రాజకీయ లబ్ధి కోసం పలు పత్రికలను ఫ్రెంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ని వాడుకొని ఇప్పుడు ఆ పత్రికలు మీడియాపై కొందరు రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజల సమస్యలను తెలియజేస్తూ ప్రజా సమస్యలు తీరేలా తమ వంతు పాత్ర పత్రికలు పోషిస్తున్నాయి.

ఆ విషయం మర్చిపోయి కొందరు ప్రజాప్రతినిధులు సోయమర్చి చిన్న పత్రికలని చిన్నచూపు చూస్తూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తన బాధ తెలుపుకొని మీ పత్రికలో కథనాలు రాసి అధిష్టానానికి తెలియాలని పత్రికలో కథనాలు వేయాలని చెప్పిన నాయకులే ఇప్పుడు చిన్న పత్రికలను చిన్నచూపు చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు.

రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో చిన్న పత్రికలపై చిన్నచూపు చూచి అవగాహన రహితంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, చోట మోట నాయకులకు కూడా కలం సత్తా ఏమిటో తెలియజేస్తాము. ఒక రాజకీయ నాయకుడిని పైకి తీసుకురావాలన్న, అంద పాతాళానికి తొక్కలన్న మీడియా చేతుల్లోనే ఉంటుందని మరోమారు రాజకీయ, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాము.

మీడియాతో పెట్టుకోవద్దని చిన్న పత్రికల పై చిన్న చూపు చూసిన వారికి ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నాం అని అన్నారు.చిన్న పత్రికల పై చిన్నపు చూపు చూసేవారు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదనిఅన్నారు.

అవసరానికి చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లను వాడుకొని అవసరం తీరాక చిన్న పత్రికలను అవహేళన చేస్తూ, విలేకరులను అవమానించడం సరికాదని తగిన గుణపాఠం చెప్తామని కల్వకుర్తి అక్షర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ హబీబ్ అహ్మద్, కే రామకృష్ణ (రఘు), అన్నారు.

ఈ కార్యక్రమంలో అక్షర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్. యూనియన్ సభ్యులు శేఖర్,ఆమీర్, ఇబ్రహీం, జాంగిర్, జంగయ్య, జంగయ్య, వేణు, నామ మురళీకృష్ణ, శంకర్, గిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS