SAKSHITHA NEWS

బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవు తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.

నిరాశలో ఉన్న కేడర్‌లో జోష్ నింపాలంటే ఈ ఎన్నికలు కారు పార్టీకి అత్యంత కీలకం కానున్నా యి. గత ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా కేడర్‌ను గాడిలో పెట్టేందుకు పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.

అందులో భాగంగానే ఎమ్మెల్సీలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిం చాలని భావిస్తోంది. వీరి సమర్ధతకు ఈ ఎన్నికలు కొలమానం కానున్నాయి. ఇప్పుడు కష్టపడే వారికి భవిష్యత్తులో పార్టీ పదవులు సైతం కట్టబెట్టాలని యోచి స్తున్నట్లు సమాచారం.

కాగా, గత ఎన్నికల్లో తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన కారు పార్టీ ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి సన్నాహాలు చేస్తుంది….

Whatsapp Image 2024 01 18 At 12.37.12 Pm

SAKSHITHA NEWS