విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో
ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ.మల్లాది విష్ణు , తూర్పు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ.దేవినేని అవినాష్ , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తో కలిసి పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ
కలెక్టర్ ఢిల్లీ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ లు కావాలని చెప్పిన మేరకు నా ఎంపీ నిధుల నుండి రూ.70 లక్షలు కేటాయించి త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా కోరాను
ఈ రోజు రూ.55.00 లక్షలతోనే అతి తక్కువ ఖర్చుతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యవసర పరికరాలతో 2 అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చి, ప్రారంభించుకున్నాం
మిగిలిన రూ.15.00 లక్షలతో మరో 2 మినీ అంబులెన్స్ లను కూడా కొద్దీ రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువస్తాము
ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చి వాటి పరిష్కర దిశగా కృషి చేస్తున్న ఢిల్లీ రావు కి ప్రత్యేక అభినందనలు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు , డిప్యూటీ ఆర్ఎంఓ మంగాదేవి సి.ఎస్.ఆర్.ఎం.ఓ పద్మావతి డిప్యూటీ సిఎస్ఆర్ మెడికల్ ఆఫీసర్ శోభ ,విజయవాడ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ లింగమనేని శివరాం ప్రసాద్ , వెలగలేటి భార్గవరాయుడు తదితరులు పాల్గొన్నారు.