SAKSHITHA NEWS

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం
— ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం కెసిఆర్ ను కలిపే బాధ్యత మాదే
— ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా
— రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అభినందన సభలో.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రాష్ట్రంలో సుమారు 14వేల మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) అన్నారు.

రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్ద ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ఆత్మీయ అభినందన సభలో ఎంపీ వద్దిరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఖమ్మంలో జనవరి 18న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ ఒక ప్రభంజనం అని, ఆ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జర్నలిస్టులకు వరాలు కురిపిస్తూ ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించడం, వాటికి సంబంధించి విధివిధానాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు. త్వరలోనే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఖమ్మం జర్నలిస్టులందరినీ హైదరాబాదు తీసుకుని వెళ్లి కెసిఆర్ తో మాట్లాడించి ఆయనకు కృతజ్ఞత తెలియజేసే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు.

ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లను కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గురించి వారు దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చాడంటే అవి పరిష్కారం పొందుతాయన్నారు.

ఖమ్మం జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. జర్నలిస్టులు లేనిదే ఒక రాజకీయ నాయకునిగా ఎదిగే పరిస్థితి లేదని, నేను ఈ స్థాయికి రావడానికి సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల సహకారం మరువలేనిదని అన్నారు.

ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముందుకు వచ్చి అనేక సందర్భాల్లో జర్నలిస్టులను ఆదుకున్న మనసున్న మారాజు అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో జర్నలిస్టులందరికీ నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు అందజేసి ఆదుకున్నాడని, ఏ ఆపద వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా ఆర్థికంగా సాయం చేసి అండగా నిలిచారని వద్దిరాజును అభినందించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయని, ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శాలువాలు కప్పి పూల బొకేలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు టియుడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నెబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, టీఎస్ చక్రవర్తి, టెంజూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి రామకృష్ణ, శెట్టి రజనీకాంత్, వనం నాగయ్య, విజేత, రాజేంద్రప్రసాద్, టెంజూ జిల్లా సహాయ కార్యదర్శి జానీపాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, టెంజు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, వీడియో జర్నలిస్ట్ అధ్యక్షులు నాగరాజు, ఫోటో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సాక్షి రాజు, నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరావు, మహిళ ప్రతినిధులు వంగూరి ఈశ్వరి, రోజా, భారతి, సంతోష్, ముత్యాల కోటేశ్వరావు, బండి కుమార్, మదర్ సాహెబ్, మోహన్, గణేష్, కృష్ణారావు, ఖాసిం, అంతోటి శ్రీనివాస్, వేణు, యాదగిరి, వేల్పుల నాగేశ్వరావు, పురుషోత్తం, సంపత్, ఉపేందర్, ఆర్కే, శ్రీనివాస్, జీవన్ రెడ్డి, శరత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS