KCR’s birthday should be declared as Rythu Day
కేసీఆర్ జన్మ దినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించాలి
ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా కేసీఆర్ జన్మ దిన వేడుకలు
రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మ దినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించాలని రైతు బంధు. ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,కేసీఆర్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ ఇప్పటికే మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మ దినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపు తున్నారని, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మ దినాన్ని కూడా రైతు దినోత్సవంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశంలోనే రైతు బాంధవునిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్ జన్మ దినాన్ని కూడా సత్వరమే రైతు దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని నల్లమల కోరారు.
రైతు పక్షపాతి అయిన కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి సంక్షేమ పథకాలతో రైతులకు మరింత చేరువయ్యారని పేర్కొన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతును రాజు చేయాలనే మహా సంకల్పంతో బీఆర్ఎస్ ను స్థాపించారని అన్నారు. మిషన్ భగీరధ ద్వారా గంగానది గమనాన్ని మార్చిన అపర భగీరధుడు కేసీఆర్ అని కొనియాడారు. అద్భుతమైన పాలన సంస్కరణలతో తెలంగాణాను అభివృద్ధి చేసి, దేశానికే దిక్చూచిగా చేశారని అన్నారు.
తెలంగాణ నీటిపారుదల రంగం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. కేసీఆర్ వల్ల నేడు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. సాగునీటి పథకాలు, ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. మూడేండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారని అన్నారు. కేంద్రంలో రైతు రాజ్యం తీసుకొచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న అలుపెరగని పోరాటానికి మనమంతా మద్దతుగా నిలవాలని నల్లమల పిలుపునిచ్చారు.
ఆయన సారధ్యంలో నవ భారత నిర్మాణానికి కంకణ బద్దులం అవుదామని నల్లమల అన్నారు. కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు తన్నీరు రవి, గొడ్డేటి మాధవరావు, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.