SAKSHITHA NEWS

కవితను చూసి కేసీఆర్ కన్నీళ్లు…

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసం నుండి ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు బెయిల్‌తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవిత.. ఇవాళ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఐదున్నర నెలల విరామం అనంతరం కవిత తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత కవితను చూసిన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు కవిత. ఢిల్లీ పరిణామాలు, తన 165 రోజుల జైలు జీవితాన్ని కేసీఆర్ కు వివరించనున్నారు. మార్చ్ 15న అరెస్ట్ అయిన సందర్భంలోనూ కేసీఆర్ కవితను కలవలేదు. అరెస్ట్ తర్వాత ములాఖత్ కు కేసీఆర్ వెళ్లలేదు. కేటీఆర్, హరీశ్ రావు, ఆమె భర్త , తల్లి ఇలా కుటుంబసభ్యులు వెళ్లి వచ్చారు.


SAKSHITHA NEWS