SAKSHITHA NEWS

రూ. 7,00,812 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డి పోచంపల్లి కి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ. 7,00,812/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని డి పోచంపల్ ఎమ్ అర్ ఓ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఅర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం అన్నారు.

పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏనాడూ ఆలోచించలేదని, ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే త‌ల్లిదండ్రులకు త‌ల‌కు మించిన భారంగా ఉండేది, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి పేద కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS