విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2.50 లక్షల పైగా కాపు సామాజిక ఓటర్లు
జనసేన చేజారిన పశ్చిమ నియోజకవర్గం
డైలమాలో జనసేన కార్యకర్తలు
జనసేన- కాపు ఓట్లు సాధించేది ఎలా…..?
టిడిపి అధిష్టానం వద్ద జిల్లా పార్టీ పెద్దల ప్రస్తావన
కృష్ణాలో ఎమ్మెల్యే – ఎంపీ తో ప్రాధాన్యం
మైలవరం జనసేనకు కేటాయించాలని డిమాండ్
పొత్తు ధర్మం ఏది…. జిల్లాలో కాపు నేతల విస్మయం
ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ పార్లమెంటు పరిధిలో సుమారుగా రెండు లక్షల 50 వేలకు పైగా కాపు సామాజిక ఓటర్లు ఉన్నారు. వారి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం డైలమాల పడింది. జిల్లాలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పొత్తుధర్మం కూడా పాటించకపోవడం వారిని మరింత కుంగతీస్తుంది.
పొత్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం జనసేనకు పార్టీ కేటాయిస్తే కొంతమేర సానుకూలంగా ఉండేది, కానీ అది బిజెపికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి, కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కొరవడింది. ఇదే విషయాన్ని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వారికి ప్రాధాన్యం లేనప్పుడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం కష్టమేనని వారు పేర్కొన్నట్లు సమాచారం.
పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే,ఎంపీ సీటు సాధించి ప్రాధాన్యత పొందారు. మరి ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి ఏంటి….? ఇక్కడ జనసేన ఓటర్లను ఆకర్షించేది ఎలా…? కాపు సామాజిక ఓటర్లను ఆకట్టుకునేది ఎలా….? పొత్తు ఎంతవరకు కాపాడుతుంది ఆ ధర్మం పాటించనప్పుడు…..??
దీంతో తెరపైకి మైలవరం వచ్చింది. మైలవరంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఇక్కడ ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇన్చార్జిగా ఉన్నారు. టిడిపిలో ఎలాగూ వర్గ విభేదాలు ఉన్నాయి. ప్రకటించకుండా మిగిలిన సీటు కాబట్టి ఇక్కడ జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్యకర్తలు-కాపు సామాజిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.