SAKSHITHA NEWS

Kanti Velak for the country, Adarsh ​​: Dundigal Chair-Person Shambhipur Krishnaveni Krishna

కంటి వెలుగు దేశానికి,ఆదర్శం : దుందిగల్ చైర్-పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ .

దుందిగల్ మునిసిపల్ పరిధి గాగిల్లాపుర్ లోని నిర్వహించిన కంటి వెలుగు రెండోవ విడత కార్యక్రమమును ఈరోజు దుందిగల్ చైర్ పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ ప్రారంభించారు.


ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ….
కంటి చూపు చాలా ముఖ్యమైనది ప్రతి పేదవాడికి పూర్తి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషం అన్నారు.


అధికారులు సిబ్బంది, ఈ పథకం ద్వార పేదలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులని, కంటి పరీక్షలకు వెళ్ళేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకువెళ్లాలని కోరారు. కంటి వెలుగు కేంద్రాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంబంధిత వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తారని, ప్రతి ఒక్కరూ దీని సద్వినియోగం చేసుకోవాలన్నారు..

ఈ కార్యక్రమంలో కమిషనర్ భోగేశ్వర్లు , నూతన కమిషనర్ సత్యనారాయణ , డాక్టర్ నిర్మల , వైస్ చైర్మన్ పద్మారావు , బౌరంపేట పాక్స్ వైస్ చైర్మన్ నల్తురి క్రిష్ణ , కౌన్సిలర్లు కుంటి అరుణ నాగరాజు , జోస్పిన్ సుధాకర్ రెడ్డి , భారత్ కుమార్ , అనంత స్వామి , పాక్స్ డైరెక్టర్ మోహన్ నాయక్ , ఎక్స్ సర్పంచ్ శ్రీను , నాయకులు కుంటి నాగరాజు , బుచ్చి రెడ్డి , సుధాకర్ రెడ్డి , జక్కుల శ్రీనివాస్ , జయ్ రాజ్ రెడ్డి , రంజిత్ రెడ్డి , మోర అశోక్ , శ్యంరావు , తోమస్ రెడ్డి , నర్సింహ , గణేష్ , లక్ష్మణ్ , ప్రవీణ్ నాయక్ , మహేష్ , యాదయ్య , శివులు, దుర్గేష్ , మునిసిపల్ సిబ్బంది, ఆరోగ్య మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….


SAKSHITHA NEWS