
ఈనెల 18 వ తారీఖున అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరగబోయే సిద్ధం సభను విజయవంతం చేయాలని చెరుకులపాడు గ్రామంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో జరిగిన భీమిలి,దెందులూరు సభలు భారీగా విజయవంతం అయ్యాయి. రాయలసీమలో జరగబోయే సిద్ధం సభ అంతకు మించి జయప్రదం చేసేందుకు పత్తికొండ నియోజవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్దామని క్రిష్ణగిరి వెల్దుర్తి మండలాల నాయకుల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గారు కోరారు.ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు,జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్, సచివాలయాల మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ,మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసి సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
