జన నీరాజనాల మధ్య సాగుతున్న కందుల పాదయాత్ర. * మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర 8 వ రోజుకు చేరింది. ఈరోజు మేకల వారి పల్లి, ఓబయపల్లి, లక్ష్మక్క పల్లి, కొండారెడ్డిపల్లి, మంగలకుంటలో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఈరోజు ఒబాయపల్లి నుండి లక్ష్మక్క పల్లి మార్గమధ్యంలో భారీ వానను సైతం లెక్కచేయకుండా నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో పెట్టిన 100 కోట్లతోనే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులకు అన్యాయం జరిగిందని 3500 కోట్లు వెలుగొండ ప్రాజెక్ట్ క పూర్తికి అవసరమని ఇక ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమని తేలిందని అందువల్లే నియోజకవర్గ ప్రజలను జాగృతం చేయడానికి పాదయాత్ర చేపట్టనని మార్కాపురం జిల్లా కోసం అనేక పోరాటాలు చేశాను అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో లోపు మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయిస్తానని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఈ సందర్భంగా పాదయాత్రలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉందని కరెంటు కూడా రాత్రి అయితే ఉండడం లేదని తెలియజేశారు. **కొండారెడ్డిపల్లి గ్రామంలో 10 వైసీపీ కుటుంబాలు మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జన నీరాజనాల మధ్య సాగుతున్న కందుల పాదయాత్ర.
Related Posts
పాత కణితి శివాలయంలో భారీ అన్న సమారాధన
SAKSHITHA NEWS పాత కణితి శివాలయంలో భారీ అన్న సమారాధన కూర్మన్నపాలెం : జీవీఎంసీ 87 వార్డు పరిధిలోగల కార్తీక మాసం నాలుగో సోమవారం పర్వదిన సందర్భంగా పాత కణితి శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య…
ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి ..
SAKSHITHA NEWS ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి … గుంటూరు బ్రాంచ్ కు మూడు పతకాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత…