SAKSHITHA NEWS

మలి విజయం దిశగా కందాళ అడుగులు

సొంత డబ్బులతో అబివృద్ది పనులు

విస్తృత జన సంబంధాలు

జననేతగా కీర్తి ప్రతిష్టలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పాలేరు నియోజకవర్గంలో అపర ధానకర్ణుడిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మలి విజయం కోసం అడుగులు వేస్తున్నారు.. ప్రత్యర్థులు సైతం పైకి విమర్శలు చేసినా లోపట మాత్రం కందాళ చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రసంశించకుడా వుండలేక పోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా మూడు మాత్రమే జనరల్ స్థానాలు అందులో పాలేరు నియోజకవర్గం ఒకటి దీంతో అందరి చూపు ఇటువైపు పడింది. 2018 ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు పై విజయం సాధించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కందాళ ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ చేరారు. దీంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారి బిఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించింది. కందాళ చేయూత పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలేరు నియోజకవర్గంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ రూ. 10 వేల చొప్పున అందిస్తున్నారు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. అలాగే గుడ్లు, చర్చలు, మసీదుల నిర్మాణానికి లక్షలాది రూపాయలు అందిస్తున్నారు. కోట్లాది రూపాయల వెచ్చించి నిరిధ్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించారు. వారికి కావాల్సిన మెటీరియల్ అందజేశారు. అక్కడ కోసింగ్ పొందిన అనేక మంది పోలీసు ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. ఎంపికైన వారి కోసం ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అనేక మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివి స్తున్నారు. తక్షణ వైద్యం అందించేందుకు గాను అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిధులు కాకుండా తన సొంత డబ్బులు వెచ్చించి రహదారి మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఇటీవల గుడ్ మార్నింగ్ పాలేరు పేరుతో నియోజకవర్గంలో పర్యటించి సమస్యలను తెలుసుకొని తక్షణమే అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా ప్రజల మద్యనే ఉండేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్ గా ప్రజల్లోకి వెళ్లిన కందాళ ఉపేందర్ రెడ్డి ఇప్పుడు జన నేతగా ఎదిగారు. ఆనాడే బలమైన నేతను డీకొని విజయం సాధించిన కందాళకు మలి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే ప్రచారం జరుగుతోంది. ఇక నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఖచ్చితమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లేమి పెద్ద మైనస్ గా మారింది. ఉన్న వారిలో వర్గపోరు కందాళ ఉపేందర్ రెడ్డి గారి కి కలిచొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇటీవల నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని తిరుగుతున్న రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారా లేక మరో అభ్యర్థిని దిగుమతి చేసుకుంటారో వేసి చూడాల్చిందే. ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్ ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించి క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్న షర్మిల బంగపడక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైనా అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప కందాళ మలి దశ విజయంను అడ్డుకోవడం కష్టమనే చెప్పొచ్చు.


SAKSHITHA NEWS