*కూకట్పల్లి మండలానికి సంబంధించి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన266 మంది లబ్ధిదారులకు 2,60,30,160/- రెండు కోట్ల అరవై లక్షల ముప్పై వేల నూట అరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు కూకట్పల్లి మండల తహసీల్దార్ కార్యలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ , మందాడి శ్రీనివాసరావు , తహసీల్దార్ స్వామి తో కలిసి అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ *
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 266 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. గతంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేసింది అని , నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మెరకు 1 లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందిస్తే సంతోషిస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. తామెప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటామని, ప్రజల కోసం మంచి చేసే కార్యక్రమాలను సమర్ధిస్తామని, సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనునిలబెట్టుకోవలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ కోరారు.
ఈ కార్యక్రమంలో RI శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,వార్డ్ మెంబెర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP