కళ్యాణ లక్ష్మి – షాది ముభారఖ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు ..
సాక్షిత : కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు15,01,740 /- రూపాయల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ..
ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఓదెల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 72 మంది కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ. 72,08,352 /- రూపాయల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణి చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…
వివాహం జరిపిన ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రైతు రుణమాఫీ 500 బోనస్ తో పాటు సంక్రాంతికి రైతు భరోసా అందిస్తున్నామన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ కూడా వడ్ల గింజ కట్టింగ్ లేకుండా కొనుగోలు చేసి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసామన్నారు.
యాసంగిలో సన్నవడ్లు సాగు చేసుకున్న రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ అందిస్తుందన్నారు.సంక్రాంతి తర్వాత రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుందన్నారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేస్తామన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ నూతన భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..