SAKSHITHA NEWS

ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రితో కాకాణి భేటి”


సాక్షిత : వెస్ట్రన్ ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .*

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి కి వివరించిన మంత్రి కాకాణి.

ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియజేసిన ఆస్ట్రేలియా శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్.

ఆంధ్ర రాష్ట్రానికి ఆధునిక సాంకేతిక సహకారాన్ని అందించడంతోపాటు, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు వ్యవసాయ పరిశోధనలకు ఆస్ట్రేలియా దేశంలో అవకాశం కల్పించాలని కోరిన మంత్రి కాకాణి.


SAKSHITHA NEWS