SAKSHITHA NEWS

Kakani Govardhan Reddy participated in the program “Gadapa Gadapaku Mana Govtara”

సాక్షిత SPS నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, మడమనూరు గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు.*
ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారు పొందిన ప్రభుత్వ పథకాలను తెలిపే బుక్లెట్లను అందజేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటిని నెరవేరుస్తూ, అన్ని విధాల ప్రజలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల, ప్రతి ఒక్కరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించిన మంత్రి.


ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, లేవా! తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామని పేర్కొన్న మంత్రి కాకాణి.


SAKSHITHA NEWS